పెర్టీసైడ్ షాపులు బంద్ విజయవంతం
చేగుంట,(విజయక్రాంతి): ఉత్పత్తిదారుల విధానాలను నిరసిస్తూ రాష్ట్ర ఫర్టిలైజర్స్ డీలర్ అసోసియేషన్ పిలుపు మేరకు చేగుంటలో మండల పెర్టీలైజర్ డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎరువుల సరఫరాపై ఎఫ్పీఎల్ విధానాన్ని అమలు చేయాలని, లింక్ ప్రొడక్ట్ లేకుండా ఎరువులు అందించాలని, డీలర్లపై ఎరువులు, పురుగు మందుల స్టాక్ పాయింట్ నుండి తీసుకురావడానికి రవాణా ఖర్చులు డీలర్ల పై వేయడంతో, దానిని నిరసిస్తూ చేగుంట మండలంలోని పురుగుల మందు, ఎరువుల దుకాణ యజమానులు సోమవారం పట్టణ కేంద్రం లో షాపులు బంద్ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు, ఎరువులు, ఫెర్టిలైజర్ షాపుల బంద్ నిర్వహించామని,కంపెనీలు ఎరువులు, పురుగు మందుల విషయంలో ఏదో ఒక లింకు పెట్టడాన్ని స్వస్తి పలకాలని, కంపెనీ లు అవలంబిస్తున్న విధానం తో రైతులపై అధిక భారం పడుతుందని వారు అన్నారు.






