అధికారులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం
పనిచేయడం చేతకాకపోతే మానుకోండి
నిర్మల్ జులై 6 ( విజయ క్రాంతి) నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంటే దాని క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయవలసిన అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయిలో అధికారుల తీరు ఏం బాగాలేదని ఏది అడిగినా దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారని ఇది ఉద్యోగ ధర్మానికి విరుద్ధమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు గా ఉండి ప్రభుత్వం ద్వారా అమలయే కార్యక్రమాలను మీరు కాకపోతే ఎవరు అమలు చేస్తారని ఘాటుగా హెచ్చరించారు.
పనిచేయడం చేతకాకపోతే వెళ్లిపోవాలని హెచ్చరించారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం అడిగితే తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఇది క్షమించారని నేరమని హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతినెల ఒకటో తారీకు ని వేతనాలు ఇస్తుందని మీరు పని చేయకపోతే ఇక నుండి వేతనాలను ఆపుతామని హెచ్చరించారు.
ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తులు 30 రోజుల్లో పరిష్కరించాలని లేకుంటే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా డి ఆర్ డి ఏ విద్యాశాఖ వ్యవసాయ శాఖ సంక్షేమం వైద్య ఆరోగ్యశాఖ అటెండెన్స్ బాగాలేదని అటెండెన్స్ డే లేనప్పుడు మీరు పని ఎలా చేస్తున్నారని కూటిగా ప్రశ్నించారు ఇప్పటికైనా జిల్లా అధికారులు కష్టపడి పని చేయాలని లెక్కలతో సహా తన వద్ద అన్ని వివరాలు ఉన్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు కిషోర్ కుమార్ వెంకటేశ్వర్లు ఆర్డిఓ రమేష్ రాథోడ్ తదితరులు ఉన్నారు.






