5 April, 2026 | 10:45 PM

మేఘాంశ్ శ్రీహరి కొత్త చిత్రం ఆస్మాన్

05-04-2026 12:00 AM

మేఘాంశ్ శ్రీహరి హీరోగా ఓ కొత్త సినిమా రానుంది. ‘ఆస్మాన్’ అనే టైటిల్ ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్ నందన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్స్ పతాకంపై కొండారు వెంకటేశ్, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీత దర్శకుడు కాగా, షోయబ్ డీవోపీగా, కృష్ణ మోహన్ తల్లూరి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవాన్ని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమానికి సాయిదుర్గతేజ్, సందీప్ కిషన్, విశ్వక్‌సేన్, నిహారిక కొణిదెల, రోషన్ కనకాల, తిరువీర్, నార్నే నితిన్, రామ్ తాళ్లూరి తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ.. “రామ్ నందన్ ఓ అద్భుతమైన కథ చెప్పారు. ‘ఆస్మాన్’తో మేం బ్లాక్‌బస్టర్ కొట్టబోతోన్నాం. మిగిలిన వివరాలు మున్ముందు ప్రకటిస్తాం” అన్నారు. డైరెక్టర్ రామ్ నందన్ మాట్లాడుతూ.. “తెలుగులో నాకు ‘ఆస్మాన్’ తొలి అవకాశం.

మూడు షెడ్యూళ్లలో సినిమాని పూర్తి చేస్తాం. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌తో రాబోతోన్నాం. ఇది చాలా కొత్తగా ఉంటుంది” అని చెప్పారు. ‘మేఘాంశ్ శ్రీహరితో మా తొలి సినిమాని చేస్తుండటం ఆనందంగా ఉంద’ని నిర్మాత శ్రీకాంత్ మన్నెం తెలిపారు. నిర్మాత వెంకటేశ్ కొండారు మాట్లాడుతూ.. “సస్పెన్స్, థ్రిల్లర్‌గా ఈ చిత్రం రాబోతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతా ల్లో చిత్రీకరిస్తాం. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కెమెరా మెన్ షోయబ్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.