తెలుగు సినిమాకు గర్వకారణం బైకర్
శర్వానంద్ హీరోగా నటించిన చిత్రం ‘బైకర్’. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించగా, రాజశేఖర్ కీలక పాత్రను పోషించారు. అభిలాష్‌రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదలైంది. థియేటర్లలో ప్రస్తుతం తమ సినిమా సందడి చేస్తోందంటూ మేకర్స్ బంపర్ బ్లాక్‌బస్టర్ మీట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హీరో శర్వా మాట్లాడుతూ.. “బైకర్’ వల్ల నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి.
ఇండియా గర్వించే సినిమా తీస్తామని చెప్పాం.. తీశాం. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. ఇది నా బెస్ట్ ఫిల్మ్ అని గర్వంగా చెప్పుకుంటా” అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మాళవిక నాయర్, దర్శకుడు అభిలాష్ రెడ్డి, సీనియర్ హీరో రాజశేఖర్, జీవిత రాజశేఖర్, సంపత్ నంది, నిరూప్ నందకుమార్, డీవోపీ యువరాజ్, ఎడిటర్ అనిల్, చిత్ర బృందం పాల్గొన్నారు.




