5 May, 2026 | 4:18 AM

నిరుద్యోగ యువతకు ఉపాధి దిశగా మెగా జాబ్‌మేళా

05-05-2026 01:19 AM

కలెక్టర్ దివాకర టీఎస్

ఖమ్మం, మే 4 (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఉపాధి దిశగా మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్ గార్డెన్స్లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఐటీ, ఫార్మసీ, బ్యాంకింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, తదితర రంగాలకు చెందిన 80 కంపెనీలు పాల్గొని సుమారు 3200 పైగా ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

ఈ రోజు ఎంపికైన అభ్యర్థులకు మే 23న నియామక పత్రాలు అందజేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నిరుద్యోగ యువత ప్రైవేట్ ఉద్యోగాలను నిర్లక్ష్యం చేయకూడ దని స్పష్టం చేశారు. మన లక్ష్యాలపై దృష్టి ఉంచుకుంటూనే ప్రస్తుతం లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, టాస్క్, డీట్, జిల్లా అధికారులు, డివైఎస్‌ఓ సునీల్ రెడ్డి, ఈడిఎం దుర్గాప్రసాద్, డిఫెన్స్ అకాడమీ ప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.