12 May, 2026 | 10:57 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి

28-11-2025 08:46 PM

బేల,(విజయక్రాంతి): ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున యాభై వేల రూపాయల కంటే అధికంగా ఉంటే అలాంటి డబ్బులను సిజ్ చేయడం జరుగుతుందని బేల మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి మనోహర్ రావ్ అన్నారు. బేల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక మండల అధికారులు, వివిధ పార్టీ ముఖ్య నాయకులతో స్థానిక ఎన్నికల పైన సమావేశం ఏర్పాటు చేశారు.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మాడల్ కోడ్ అఫ్ కండక్ట్ అమలు అయిన సందర్బంగా మండలంలోని వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు ప్రశాంత వాతావరణంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికల నియామవాలి గురించి సూచించారు. మండలంలోని బేల, చప్రాల, దహెగావ్, సదల్ పూర్, సాంగిడి, సిర్సన్న, ఆరు క్లస్టర్ పరిధిలో ఆయా గ్రామాల అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెసులుబాటు కల్పించారు. ముందస్తుగానే ఏక గ్రీవంగా తీర్మానం చేయడం చల్లదన్నారు. ఖచ్చితంగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయాల్సిందేనని పేర్కొన్నారు.