30 May, 2026 | 8:33 PM

అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుంది

30-05-2026 07:06 PM

మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై విస్తృత స్థాయి సన్నాహా సమావేశం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెళ్తున్న సందర్భంగా నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద, కన్నారెడ్డి గ్రామాల రైతులు,గ్రామస్తులు  గ్రామాల పరిధిలో గల గేటు వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని వరి ధాన్యం కొనుగోలు ఆలస్యంపై మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డికి వారి బాధను మొరపెట్టుకున్నారు.

కన్నా రెడ్డి,మాల్తుమ్మెద గ్రామాల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు హనుమత్ షిండే, జనార్దన్ గౌడ్, జాజాల సురేందర్,మాజీ ఎమ్మెల్సీ విజిగౌడ్,మాజీ జెడ్పీ చైర్మన్ దఫెదర్ రాజులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.... రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ఇప్పటివరకు రైతులు ఆరబెట్టుకున్న వడ్లను ఆసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు ఆలస్యంతో  రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకలు వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రాబోయే రెండు రోజుల్లో కల్లాలలోని వడ్లన్నిటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కొనుగోలు చేయకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నాలుగు రోజుల క్రితం కాన్నారెడ్డి గ్రామ రైతులు, గ్రామస్తులు కలిసి ధాన్యం కొనుగోలు విషయంపై రాస్తారోకో చేపడితే ఎల్లారెడ్డి ఆర్డీవో నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అప్పటినుండి ఇప్పటివరకు ఒకటి లారీ మాత్రమే వచ్చిందనీ, మళ్లీ రైతులు ధర్నా చేస్తారని తెలుపుతున్నారని త్వరగా పూర్తి చేయాలన్నారు.

ధాన్యం ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ తొందరగా పూర్తి చేయాలని అధికారులకు చరవాణి ద్వారా సూచించారు. గ్రౌండ్ బ్యాలెన్స్ తప్పుడు రిపోర్టు ఇస్తున్నారని అధికారులకు తెలిపారు.మాల్తుమ్మెద గ్రామానికి వెళ్లాను థర్టీ పర్సెంట్ లిఫ్ట్ అయింది 70% ఇంకా బ్యాలెన్స్ ఉందని తెలిపారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుపై విస్తృతస్థాయి సన్నహాకా సమావేశం ఉందని వెళ్తుంటే రైతులే ఆపుతున్నారని మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా అధికారులకు చరవాణి ద్వారా తెలియజేశారు.పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని రైతులకు తెలిపారు.