ఢిల్లీలో న్యాయశాఖ ఉద్యోగుల సమావేశం
హాజరైన తెలంగాణ ఉద్యోగులు
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ఢిల్లీలో జరిగిన న్యాయశాఖ ఉద్యోగుల సం ఘం అఖిల భారతీయ న్యాయశాఖ ఉద్యోగు ల సంఘం అధ్యక్షుల స్థాయి సమావేశం రాజు భాయ్ (గుజరాత్), నగేష్ జాతీయ ప్ర ధాన కార్యదర్శి (కర్ణాటక) సమావేశానికి తెలంగాణ నుంచి బోద లక్ష్మారెడ్డి, జాతీయ కార్యదర్శి ఎస్వీ సుబ్బయ్య జాతీయ ఉపాధ్యక్షుడు, ప్రేమ్ కుమార్, రమణారావు, రాష్ట్ర ప్రధాన వీరబాబు మాతంగి, కోశాధిఖారి నరేష్ యాదవ్ హాజరయ్యారు.
ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన శెట్టి కమి షన్ ద్వారా మరొక ఇంక్రిమెంట్ రావాల్సిన అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చించారు. ఆరోగ్య భద్రతకు సంబంధించి న్యాయమూర్తులకు తత్సమానంగా అమలు జరిగే విధం గా కోరారు. అత్యున్నత న్యాయస్థానం సు ప్రీంకోర్టులో మన న్యాయశాఖ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరింప చేసేందుకు కృషి చేయాలని కోరారు.






