నల్లపోచమ్మ ఆలయ నూతన ద్వారాన్ని ప్రారంభించిన బండి రమేష్
కూకట్‌పల్లి, జులై 26 (విజయక్రాంతి): కూకట్పల్లి నియోజకవర్గ పరిధి మూసాపేట్ లోని శ్రీనల్ల పోచమ్మ ఆలయ నూతన ద్వారాన్ని ఆదివారం ప్రారంభించిన టిపిసిసి ఉపాధ్యక్షులు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్. అనంతరం ఆలయంలో జరిగిన శాంతి పూజలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండి రమేష్ మాట్లాడుతూ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి అనుగ్రహం రాష్ట్ర ప్రజల అందరిపై ఎల్లప్పుడు ఉండాలన్నారు.
ప్రతి కుటుంబం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరూ శాంతి సామరస్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయం ఎల్లప్పుడూ అందిస్తామని ఆలయ కమిటీకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, బి బ్లాకు అధ్యక్షులు తూము వేణు, ఏఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి, ఆలయ చైర్మన్ బిక్షపతి,కాంగ్రెస్ నాయకులు లక్ష్మయ్య, కర్కే పెంటయ్య, హరిప్రసాద్ నాయుడు, శంకర్, సచిన్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






