27 July, 2026 | 1:15 AM

మేడ్చల్ ఆర్టీసీ డిపోలో ఆషాఢమాస బోనాల మహోత్సవాలు

27-07-2026 12:21 AM

మేడ్చల్ అర్బన్ జూలై 26(విజయక్రాంతి):మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఘనంగా ఆషాఢమాస బోనాల పండుగ మహోత్సవాలను జరుపుకున్నారు. ఆదివారం ఆర్టీసీ డిపో గ్యారేజ్ లో ఆషాఢమాస బోనాల పండుగ మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

మేడ్చల్ ఆర్టీసీ డిపోలో నిర్వహించిన బోనాల పండుగలో డిపో అధికారులు,ఉద్యోగులు మహిళా కండక్టర్ లు,డ్రైవర్ లు గ్యారేజ్ సిబ్బంది,ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పెద్దఎత్తున ఏడుగుళ్ల వద్దకు తరలివచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి అస్ట ఆయురారోగ్యాలుసుఖాంతోషలతో కలిగి ఉండేలా దీవించాలని అమ్మవారిని ఆర్టీసీ కార్మికులు అధికారులు కోరుకున్నట్లు తెలిపారు.