25 April, 2026 | 8:35 PM

లోకోస్ విఓఏలకు సమీక్ష సమావేశం

25-04-2026 07:01 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): లోకోస్ విఓఎలకు సమీక్షా సమావేశం మండల సమాఖ్య కార్యాలయంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సంస్థగత నిర్మాణం అధికారి శ్రీనివాస్ విఓఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...లోకోస్ ప్రొఫైల్ మరియు కటౌఫ్ షీట్స్ ఎంట్రీ మే నేల 8వ తేది వరకు పూర్తి చేయాలనీ అదేశించారు. లోకోస్లో సభ్యుల వివరాలు, సంఘల వివరాలు నమోదు చేయడం, ఆర్థిక లావాదేవీలు నమోదు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వంకు సంబందించిన పథకాల ప్రయోజనాలు నేరుగా సంఘ సభ్యులకు వర్తిస్తాయని డీపీఎం శ్రీనివాస్  వివరించారు.కావునా అందరు లోకోస్ పై ద్రుష్టిపెట్టి నమోదు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్,సీసీలు నారాయణ,దత్తు,రమేష్, రషీద్,రవి,నజీర్,సావిత్రి, అకౌంటెంట్ రాజు,ఆపరేటర్ రవి,వివోఏలు పాల్గొన్నారు.