20న మెడికల్ షాప్స్ బంద్
16-05-2026 08:27 PM
జడ్చర్ల: ఏఐఓసీడి పిలుపుమేరకు భారతదేశవ్యాప్తంగా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న మెడికల్ షాప్స్ అన్ని బందు పాటించేందుకు సన్నతమవుతుండ్రు. .ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని,కార్పొరేట్ అత్యధిక డిస్కౌంట్లకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తున్నట్లు వారు ప్రకటించారు. సమాజంలో నకిలీ మందుల చలామణి ఉండకూడదని రోగుల ప్రాణాలను కాపాడాలని ఏఐఓసిడి డిమాండ్ చేస్తూ బందుకు సంబంధించిన పోస్టర్ ను జడ్చర్ల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ విడుదల చేసింది ఈ బందుకు ప్రజల మద్దతు కోరుకుంటూ అత్యవసరం మందులు ముందుగానే తీసుకోవాలని అసోసియేషన్ సూచన చేస్తుంది.






