మౌలిక వసతులు కల్పించండి
సమస్యలపై జోనల్ కమిషనర్‌కు తుంగతుర్తి రవి వినతి
మేడిపల్లి,(విజయక్రాంతి): మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలోని పలు కాలనీలలో ఎదుర్కొంటున్న తీవ్రమైన మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి శనివారం ఉప్పల్ జోనల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ, మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్ల పరిధిలోని ధరణి కాలనీ, బీపీఎం కాలనీలతో పాటు పలు కాలనీల ప్రజలు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలలో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలి. మురుగునీరు రోడ్లపైకి రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని, గుంతలమయంగా మారిన అంతర్గత రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టి, కొత్త సీసీ రోడ్లను నిర్మించాలని. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని కాలనీలకు క్రమబద్ధంగా, స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలన్నారు.






