14 August, 2026 | 12:06 AM

భరత మాత గీతం ఆవిష్కరించిన కలెక్టర్

13-08-2026 09:35 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): భావి భారత పౌరులు విద్యార్థులకు భరతమాత గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకతను తెలుపుతూ రచయిత,గాయకుడు తిరుమల నాగేంద్ర రచించిన భరత మాత గీతాన్ని గురువారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఖుష్బూ  గుప్తా  ఆవిష్కరించారు.  భవిష్యత్ తరాలకు ఇది చాలా ఆదర్శంగా ఉంటుందని భావి భారత పౌరులైన విద్యార్థుల్లో జాతీయ సమైక్యత భావాన్ని, నైతిక విలువలను పెంపొందించే విదంగా ఈ గీతం ఉందని కలెక్టర్ గేయ రచయితని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఏ ఎం ఓ దుంకుడు శ్రీనివాస్ ,కవి, రచయిత, ఎం ఎన్ విజయకుమార్ ,స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.