కైలాస్ టేకిడి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే.
13-08-2026 09:44 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కైలాస్ ఎగిరి శివాలయాన్ని గురువారం సాయంత్రం బోత్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా లింభాజీ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పచ్చని అడవుల మధ్యన ఉన్న ఆలయానికి ఎమ్మెల్యే అనుచరులతో కాలినడకన వెళ్లి దర్శించారు.
ఈ సందర్భంగా ఆలయ వద్ద కొనసాగుతున్న సిసి రోడ్డు పనులను పరిశీలించడం జరిగింది. ఎమ్మెల్యే వెంట మాజీ జెడ్పిటిసి సంధ్యారాణి, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ సర్పంచులు సుధీర్ రెడ్డి రూప్ చంద్ ,రవీందర్ జాదవ్, అంబాజీ సంజయ్ రాజు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






