13 August, 2026 | 10:53 PM

మహాముత్తారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

13-08-2026 09:37 PM

మహా ముత్తారం,(విజయక్రాంతి): జిల్లాలో పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ గారు గురువారం మహాముత్తారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ  పోలీసు స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, కేసులను నాణ్యతతో దర్యాప్తు చేయాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.