22 April, 2026 | 2:02 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్రిడేషన్ కార్డులు

09-04-2026 01:53 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లాలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్రిడేషన్ కార్డు జారీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి నేడొక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మీడియా అక్రిడేషన్ కమిటీ ఏర్పాటు కావడం జరిగిందని, అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 239 ప్రకారం 2022 లో జారీచేసిన అక్రిడేషన్ కార్డుల కాలపరిమితి ఏప్రిల్ 30 తో ముగుస్తున్నందున  మే, 1వ తేదీ నుండి 2 సంవత్సరాల కాల పరిమితితో కూడిన  కొత్త అక్రిడేషన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

కావున జర్నలిస్టులు తేది: 12-4-2026 లోపు  తప్పులు లేకుండా అన్ని దృపత్రాలతో దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచించారు. ఏప్రిల్ 12, 2026 సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను మాత్రమే  మొదటి అక్రిడేషన్ జాబితా కింద పరిగణనలోకి తీసుకొని జిల్లా కమిటీ ద్వారా పరిశీలన చేసి అర్హులైన జర్నలిస్టులకు  అక్రిడేషన్  కార్డులు జారీ చేయబడును. నిర్ణీత గడువు తర్వాత దరఖాస్తు చేసుకున్న వారిని రెండవ జాబితాలో పరిశీలించబడుననీ తెలియజేశారు.