13 June, 2026 | 9:35 PM

Breaking News

భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి   •   ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు తక్షణమే సరఫరా చేయాలి   •   బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గొల్ల ప్రభు   •   జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   తెలంగాణకు బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు   •   జాతీయ సెమినార్ లో కోయగూడెం వాసికి సన్మానం   •   మైనర్ బాలికపై దాడి ఘటనను ఖండిస్తూ అశ్వాపురంలో భారీ నిరసన ర్యాలీ   •   అభివృద్ధిని అడ్డుకునే విమర్శలు మానుకుని సహకరించాలి   •   కల్లూరులో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం   •   వేశ్య కాంతల చెరువు.. తామరచెరువు బేతుపల్లి చెరువులను సర్వే చేయాలి   •  

తెలంగాణ ఉద్యమ యోధుడు మురళీధర్ దేశ్ పాండేకు కవిత నివాళి

10-06-2026 04:35 PM

నాగోల్: తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు మురళీధర్ దేశ్ పాండే మృతికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం కొత్తపేటలోని ఆయన నివాసానికి రాష్ట్ర నేత ఇస్మాయిల్ తో కలసి వెళ్లిన కవిత, మురళీధర్ దేశ్ పాండే పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో మురళీధర్ దేశ్ పాండే చేసిన సేవలు చిరస్మరణీయమని కవిత పేర్కొన్నారు.

సామాజిక న్యాయం, ప్రజా హక్కుల కోసం ఆయన జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని అన్నారు. కాగా, మురళీధర్ దేశ్ పాండే బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో కొత్తపేటలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ, సామాజిక సంస్థల నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.