ఇలా అయితే.. లక్ష్యం చేరేదేలా..?
ఉట్నూర్,(విజయక్రాంతి): వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు గ్రామపంచాయతీ కేంద్రాల్లో నర్సరీలు నిర్వహిస్తున్నారు. వానాకాలం నాటికి ఇందులో మొక్కలు సిద్ధంగా ఉండేలా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో మొక్కలను పెంచుతున్నారు. కానీ చాలా చోట్ల ఆ పరిస్థితి లేదు. ఇటు గ్రామపంచాయతీ అధికారులతో పాటు.. అటు జాతీయ ఉపాధి హామీ పథకం అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఉట్కూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ, నార్నూర్ మండలాల పరిధిలోని ఒక్క వంద రెండు గ్రామపంచాయతీలో వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు ఒక గ్రామ పంచాయతీకి పదివేల చొప్పున మొక్కలను పెంచుతున్నారు.
జూన్ 12 తర్వాత వర్షాలు కురుస్తాయని అధికారులు భావించి జులై మొదటి వారంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుటకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రభుత్వ ప్రణాళికలు మండల గ్రామ పంచాయతీలకు చేరకముందే నర్సరీలో పెంచుతున్న మొక్కలు నాటే విధంగా ఎదగడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఆగమేఘాల మీద నర్సరీలో చిన్నపాటి మొక్కలను నాటిన 15 రోజులకే చనిపోతాయని ఆయా గ్రామాల రైతులు ప్రజలు అంటున్నారు. కొన్ని గ్రామపంచాయతీలో నర్సరీలో ఏర్పాటుచేసిన మొక్కల పెంపకం ప్లాస్టిక్ బ్యాగ్ లో మొక్క కంటికి కనిపించడం లేదని ప్రజలంటున్నారు.
నర్సరీల పెంపకానికి లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన నర్సరీలలో నాట్ ఎందుకు వీలుగా మొక్కలు కల్పించడం లేదని ప్రజలంటున్నారు. మొక్కల పెంపకం పేరుతో అధికారులు నిధులను పక్కదారి పట్టించి ఉంటారని ప్రజలలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నర్సరీలు ఏర్పాటు చేయడం పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు సైతం నర్సరీల వైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా వనమోత్సవానికి ముందు మొక్కలను సిద్ధం చేయాలని గిరిజనులు కోరుతున్నారు.






