10 June, 2026 | 5:01 PM

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష

10-06-2026 04:07 PM

హైదరాబాద్: నల్గొండ జిల్లా అభివృద్ధిపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి, ధాన్యం సేకరణ తదితర అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బ్రాహ్మణ వెల్లెంల  ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, నార్కెట్‌పల్లి ఆర్‌వోబీ నిర్మాణానికి తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించాను. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. నల్గొండలో 2 పడక గదుల ఇళ్లను మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతి, మౌలిక వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.