శభాష్ ఎల్లన్న సారు
భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బైంసా మండలం వానల్ పహాడ్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్లన్న సార్ తమ బడిలో చదువుతున్న ముగ్గురు పిల్లలకు బెస్ట్ అవైలబుల్ ఎంపిక చేయించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఎస్సీ పిల్లలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ నోటిఫికేషన్ రాగానే ఆయనే స్వయంగా ఖర్చుపెట్టి ఆన్లైన్ అప్లికేషన్ చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన లక్కీ డ్రాకు స్కూల్ నుంచి ఆరుగురు విద్యార్థులను తీసుకురాగా అందులో ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు.
దుమ్ములవార్ వేదిక గంధం పావని సాత్విక్ ముగ్గురు విద్యార్థులు పాఠశాల నుంచి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. పాఠశాలలో చదివి పిల్లలను ప్రభుత్వ కార్పోరేట్ విద్యా అవకాశాలు అందిపుత్యాలను లక్ష్యంతో విద్యార్థులను ప్రోత్సహించినట్టు ఆయన తెలిపారు. సర్కార్ పాఠశాలలో పాటలు బోధించే ఉపాధ్యాయుడు సాటివారికి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.






