కేటీఆర్‌ను కలిసిన మేడ్చల్ బీఆర్‌ఎస్ నేతలు
మేడ్చల్ అర్బన్ జూలై 1(విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర విఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావును మేడ్చల్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్ మర్యా ద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దర్శనం చేసుకున్న భాస్కర్ యాదవ్,హైదరాబాద్ నగరంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో కలిసి స్వామి ప్రసాదాన్ని అందజేశారు.
అనంతరం రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయంపై చర్చించినట్లు భాస్కర్ యాదవ్ వెల్లడించారు.మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధి పై భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చీర్ల దయానంద యాదవ్ లను కేటీఆర్ అడిగి తెలుసుకున్నట్లు వారు చెప్పారు.
అంతే కాకుండా సర్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక హోదా సవరణ కార్యక్రమంపై టిఆర్‌ఎస్ నాయకులు చొరవచూపి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎ లాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేటీఆర్ సూచించారు. మేడ్చల్ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని నియోజకవర్గం నాయకులకు సూచించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమ పథకాలను గుర్తు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ భాస్కర్ యాదవ్,దయానంద్ యాదవ్ లకు గుర్తు చేశారు...






