పేదల ఇళ్లస్థలాల జోలికి వస్తే ఊరుకోం
బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి
మొయినాబాద్, జూలై 1(విజయక్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్నగర్లో 60 గజాల ఇళ్ల స్థలాల కోసం బాధితులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు బీఆర్‌ఎస్ పార్టీ పూర్తి సంఘీభా వం ప్రకటించింది. దీక్షా శిబిరాన్ని సందర్శించిన బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, సీనియర్ నాయకుడు కొత్త న ర్సింహారెడ్డి బాధితులకు మద్దతుగా మాట్లాడారు.2007లో హిమాయత్నగర్ సర్వే నం బర్ 151లో 290 మంది పేద కుటుంబాల కు ప్రభుత్వం 60 గజాల చొప్పున ఇళ్ల స్థలా ల పట్టాలు ఇచ్చిందని, ఇప్పుడు ఆ భూమిని మార్కెట్ యార్డు కోసం తిరిగి తీసుకోవడం అన్యాయమని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు.
తాము మార్కెట్ యార్డు ఏర్పా టుకు లేదా అభివృద్ధి కార్యక్రమాలకు వ్యతిరేకం కాదని, అయితే పేదలకు కేటాయించిన భూములను అందుకోసం లాక్కోవడాన్ని సహించబోమని హెచ్చరించారు.గత బీఆర్‌ఎస్ హయాంలోనే అన్ని న్యాయపరమైన అడ్డంకులను తొలగించి, ఈ స్థలంలో ‘కేసీఆర్ కాలనీ‘ పేరుతో శంకుస్థాపన కూడా చేశామని వారు గుర్తుచేశారు.
పోరాటం కొనసాగించాలి: ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు బాధితులు ఆందోళనలను కొనసాగించాలని, ఈ ఉద్యమంలో మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పేదలకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చారెడ్డి వెంకట్రెడ్డి, పలువురు ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు బాధితులు పాల్గొన్నారు.






