17 April, 2026 | 6:11 AM

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు..

17-04-2026 01:42 AM

గాంధారి, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి) : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్క అర్హునికి అందేలా చర్యలు తీసుకుంటామని అడిషనల్ డిఆర్డిఓ విజయలక్ష్మి అన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మండల స్థాయి సమావేశాన్ని స్థానిక మారుతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మండలంలో ఇప్పటివరకు అమలైన సంక్షేమ పథకాల వివరాలను ఆయా శాఖల అధికారులు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బండారి పరమేశ్వర్, స్థానిక సర్పంచ్ మమ్మాయి రేణుకా యాదవ్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు బీస గణేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్, తహసీల్దార్ రేణుకా చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీఓ లక్ష్మీనారాయణ, మండల విద్యాధికారి శ్రీహరి, వివిధ శాఖల అధికారులు, పలువురు సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.