కలెక్టరేట్ లో దొడ్డి కొమురయ్య వర్ధంతి
04-07-2026 05:41 PM
నిర్మల్,(విజయక్రాంతి): కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివారం ఉదయం దొడ్డి కొమురయ్య వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాట్లాడుతూ... ఆనాటి కాలంలో తెలంగాణ ప్రజలను బానిసత్వపు సంకెళ్ళ నుంచి బంధవిముక్తి చేసేందుకు పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ఎంతో తెగువతో నిజాం నిరంకుశత్వాన్ని, దొరల ఆగడాలపై వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. ఇలాంటి మహనీయుల జయంతి, వర్ధంతుల కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. తెలిపారు.






