పెద్దమల్లారెడ్డిలో ఉపాధి హామీ కూలీలకు ఓఆర్‌ఎస్ పంపిణీ
17-04-2026 01:41 AM
భిక్కనూర్, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): మండలంలో ఉదయం నుంచే 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పెద్దమల్లారెడ్డి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆశా వర్కర్లు, ఫీల్ అసిస్టెంట్ కొండల్ రెడ్డి కూలీలకు ఓఆర్‌ఎస్ అందజేశారు.
ఈ సందర్భంగా ఫీల్ అసిస్టెంట్ కొండల్ రెడ్డి మాట్లాడుతూ ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున కూలీలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వడదెబ్బకు గురికాకుండా ఎక్కువగా నీరు తాగాలని, తలకు గుడ్డ కట్టుకోవాలని, ఎండలో ఎక్కువసేపు పనిచేయకుండా మధ్య మధ్యలో విరామాలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.






