2 July, 2026 | 11:56 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

డ్రగ్స్ నియంత్రణకు చర్యలు

12-04-2026 12:02 AM

హెల్త్ వీక్‌లో భాగంగా అవగాహన కార్యక్రమం

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): డ్రగ్ దుర్వినియోగాన్ని అరికట్టేందు కు కట్టుదిట్టమైన చర్యలు అవసరమని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ కార్యక్రమాల్లో 6వ రోజు శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని జిల్లా ఆసుపత్రిలో డ్రగ్ నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ డా. కె. లలితా దేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలవాటు కలిగించే ఔషధాల దుర్విని యోగం నివారణ, నాణ్యమైన ఔషధాల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కల్పించారు.

జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. డ్రగ్ కంట్రోల్ అథారిటీ, ఈగిల్ ఫోర్స్ తెలంగాణ ప్రతినిధులు పోస్టర్లను ఆవిష్కరించి డ్రగ్ దుర్వినియోగంపై అవగాహన పెంచారు. క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలైన ఫార్మసీ, నర్సింగ్, పాఠశాల విద్యార్థుల కు బహుమతులు అందజేశారు. యువతలో డ్రగ్ దుర్వినియోగం నివారణకు ఈ కార్యక్రమాలు దోహద టపడుతున్నాయని పేర్కొ న్నారు. డీఎస్పీ రమేష్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్, డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్, మెడికల్ సూపరింటెండెంట్ డా. చంద్రకృష్ణ పాల్గొన్నారు.