2 July, 2026 | 10:49 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

కీసరలో దోపిడీ ముఠా అరెస్ట్

12-04-2026 12:04 AM

మేడ్చల్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్లో  శనివారం మీడియా సమావేశంలో డీసీపీ శ్రీధర్ వివరాలు వెల్లడిం చారు. నాలుగు రోజుల క్రితం ఒక యువకుడి పై దాడి చేసి బంగారం, వాహనం, మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఆరు మొబైల్ ఫోన్లు, ఒక కారు, ఒక స్కూటీ, సుమారు 15 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఏడుగురు నిందితుల్లో ఒకరు పరారీలో ఉండగా, మిగతా ఆరుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిందితులు గతం లో అబ్దుల్లాపూర్మెట్, ఘట్కేసర్, కీసర ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇంటర్నెట్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువకులను లక్ష్యంగా చేసుకుని, వారి వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి బెదిరింపులకు పాల్పడుతూ సొమ్ము దోచుకునే విధానాన్ని అనుసరిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో యువత అపరిచితులతో పరిచయాల్లో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వివ రాలు పంచుకోవద్దని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారు లు పాల్గొన్నారు.