15 August, 2026 | 12:59 AM

వరద సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు

15-08-2026 12:10 AM

క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

భారీ అవుట్లెట్ నిర్మించి వరద నీటి నిల్వకు చెక్: జోనల్ కమిషనర్ హామీ

నాగోల్, ఆగస్టు 14 (విజయక్రాంతి): నాగోల్ డివిజన్ పరిధిలోని మధురానగర్లో వర్షాకాలం లో నెలకొంటున్న వరద నీటి స మస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు ధీర్ రెడ్డి శుక్రవారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతోతో కలిసి కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంద్రప్రస్థ కాలనీ, ధనలక్ష్మి నగర్తో పాటు పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు, డ్రైనేజీ నీరు మధురానగర్ వద్ద నిలిచిపోవడంతో స్వల్ప వర్షానికే కాలనీలో మోకాళ్ల లోతు నీరు చేరుతోందన్నారు. గతంలో ఏర్పాటు చేసిన చిన్న అవుట్లెట్ ప్రస్తుతం సరిపోవడం లేదని, దాని స్థానంలో పెద్ద అవుట్లెట్ నిర్మిస్తే వరదనీరు వేగంగా బయటకు వెళ్లే అవకాశం ఉంటుందని జోనల్ కమిషనర్కు సూచించారు. ఈ పర్యటనలో సీనియర్ బీఆర్‌ఎస్ నాయకుడు అనంతుల రాజిరెడ్డి, డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.