27 March, 2026 | 2:02 AM

ప్రతిదీ రాజకీయం చేస్తుండ్రు

27-03-2026 12:16 AM

భోజనశాల షెడ్డు కూలగొట్టిందెవరు?

నిన్న మాటిచ్చాము నేడు నెరవేర్చాము

-రూ 5 భోజనశాలకు ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేసి ప్రారంభించిన మేయర్ గుమల్ మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి

మహబూబ్ నగర్, మార్చి 26 (విజయక్రాంతి): ప్రజలకు మంచి చేయాలనే తపనతో అడుగులు వేస్తున్నామని ప్రతిదీ రాజకీయం చేసి లబ్ది పొందాలని ఆశ తమకు లేదని మేయర్ గుమల్ మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని బస్టాండ్ ఎదురుగా టెంటు ఏర్పాటు చేసి రూ 5 భోజనం ను అందిస్తున్న కేంద్రానికి ప్రత్యేక రేకుల షెడ్డు ను ఏర్పాటు చేసి గురువారం ప్రారంభించారు.

నాడు రూ 5 భోజనశాల షెడ్డును లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించి కూలగొట్టింది ఎవరని ప్రశ్నించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏదో రాజకీయ లబ్ధి పొందెందుకు నిరంతరం తపిస్తున్నాడని ఇది సరైన పద్ధతి కాదన్నారు. ప్రజలకు మంచి చే యడం మరిచి కేవలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేయడం ఏంటో అర్థం కాని ప్రశ్నగా మిగులుతుందన్నారు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నిరంతరం పరితపిస్తున్నారని తెలిపారు.

బుధవారం మాటిచ్చి గురువారం ప్రత్యేక షెడ్యూల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రతి విషయంలో పాదశకంగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం రాజీవ్ గృహకల్ప లో నీటి ఎద్దడి ని నివా రించాలని సంకల్పంతో ప్రత్యేక బోరును వేయించి ఆ ప్రాంత వాసులకు చిత్త బుట్టిలను డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, తదితరులు ఉన్నారు.