27 March, 2026 | 3:51 AM

విజయక్రాంతి కథనానికి స్పందన

27-03-2026 12:13 AM

బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించిన పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి 

చిన్నచింత కుంట, మార్చి 26 : మండల కేంద్రం నుంచి ఉంద్యాల హైలెవల్ బ్రిడ్జి ఇటీవల ప్రారంభమైన విషయం విధితమే. రూ 1.70 కోట్ల నిధుల ఖ ర్చు తో ఈ బ్రిడ్జి చేపడుతున్నప్పటికీ నిర్మాణ దశలోనే తట్టు సంచులు కప్పి నీళ్లు పోయకుండా నిర్మా ణంలో నాణ్యత పాటించకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారని విజయక్రాంతి దినపత్రికలో ఈనెల 26వ తేదీన ప్రత్యేక కథనం ప్రత్యేకం చేసింది. ఈ విషయంపై స్పందించిన పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరెడ్డి బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న ప్రాంతానికి విచ్చేసి ప్రత్యేకంగా పరిశీలించారు.

వేసవి కాలంలో నిర్మాణం జరుగుతుండడంతో ప్రత్యేకంగా నిర్మాణం చేసిన వాటిని తట్టు సంచులతో పదును ఉండేలా చూడాలని సూచించారు. సంబంధిత కాంట్రాక్టర్కు ఎక్కడ రాజీ లేకుండా పూర్తిస్థాయిలో పటిష్టమైన నిర్మాణం నియమ నిబంధనలతో పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎఈ శివకుమార్ ఎప్పటికప్పుడు బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రత్యేకంగా పరిశీలిస్తూ నాణ్యతగా ఉండేలా చూడాలని ఆదేశించారు.