వంటగ్యాస్ కోసం ప్రజల పాట్లు
సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు యత్నం
హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 26 (విజయక్రాంతి): గ్యాస్ సిలిండర్లు బుక్ చేసి రోజులు గడుస్తున్నా రాకపోవడంతో వినియోగదారులు తీవ్ర అసహనానికి గురవుతు న్నారు. దీంతో డెలివరీ ఆటోలో నుంచి గ్యాస్ సిలిండర్లను వినియోగదారులు ఎత్తుకెళ్లేందుకు యత్నించిన ఘటన ఫిల్మ్‌నగర్ పరిధి లోని షేక్‌పేట్‌లో గురువారం జరిగింది. షేక్‌పేట్ ప్రాంతంలోని ఓ గ్యాస్ ఏజెన్సీకి చెందిన ఆటో సిలిండర్ల లోడ్‌తో డెలివరీ కోసం గోదాం నుంచి బయటకు వచ్చింది.
సిలిండర్ల కోసం పడిగాపులు కాస్తూ సహనం కోల్పోయిన కొందరు వినియోగదారులు ఆ డెలివరీ ఆటోను మార్గమధ్యంలో అడ్డుకున్నారు. గ్యాస్ బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా తమకు ఎందుకు డెలివరీ చేయడం లేదంటూ సిబ్బందిని నిలదీశారు. ఏజెన్సీల నిర్లక్ష్యం వల్లే తాము ఇబ్బందు లు పడుతున్నామంటూ వాగ్వాదానికి దిగా రు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఆటోలో ఉన్న సిలిండర్లను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎవరికి వారు సిలిండర్లను లాక్కునేందుకు యత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏజెన్సీ సిబ్బంది చుట్టుపక్కల ఉన్న స్థానికుల సహాయం కోరారు. స్థానికులు, ఏజెన్సీ సిబ్బంది కలిసి అతికష్టం మీద సిలిండర్లు తీసుకెళ్తున్న వారిని అడ్డుకున్నారు.




