3 August, 2026 | 5:16 AM

మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

03-08-2026 12:43 AM

రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్

దోమకొండ, ఆగస్టు 2 (విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గం దోమకొండ మండల కేంద్రంలో ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక చాముండేశ్వరి దేవి ఆలయానికి చేరుకున్న ఆయన ఆలయ అర్చకుల వేదమంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులను ఉద్దేశించి మహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ప్రజల ఐక్యతకు, భక్తి భావానికి నిదర్శనమని అన్నారు. అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, యువతకు ఉపాధి అవకాశాలు లభించాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను మతసామరస్యం, పరస్పర గౌరవం తెలంగాణ సమాజానికి ప్రత్యేక గుర్తింపు అని, అన్ని మతాలు, అన్ని పండుగలను సమాన గౌరవంతో జరుపుకోవడం మన సంస్కృతి గొప్పతనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మహమ్మద్ ఇలియాస్ను ఘనంగా సన్మానిం చారు, కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సమస్త చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్ , భీమ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య, సుదర్శన్, మండల కాంగ్రెస్ నాయకులు అనంతరెడ్డి, ఆశ బోయిన శ్రీనివాస్ , బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, నౌసి లాల్ నాయక్, గంప ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు,  ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళలు, భక్తులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.