2 March, 2026 | 6:13 AM

నేను మాట నిలబెట్టుకున్నా.. కాంగ్రెస్‌ను నిలదీయండి

02-03-2026 02:19 AM
  1. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

పీచుపల్లి గ్రామానికి రూ.10 లక్షల ప్రోత్సహకం అందజేత

గన్నేరువరం, మార్చి 1(విజయ క్రాంతి): బీజేపీ బలపర్చిన సర్పంచు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు10 లక్షల ప్రోత్సహకాన్ని అందజేస్తానంటూ ప్రకటించి నేడు మాట నిలబెట్టుకున్నానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకున్న గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, కోహెడ మండంలోని విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీలకు తన ఎంపీ లాడ్స్ నిధుల నుండి10 లక్షల చొప్పున ప్రోత్సహక నిధులు విడుదల చేశారు.

గ్రామస్థుల సమక్షంలో ఆయా నిధుల సర్క్యులర్ కాపీలను గ్రామ సర్పంచులకు అందజేశారు. ఈ సం దర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ భవిష్యత్తులో గ్రామాల అభివ్రుద్ధి కోసం కేంద్రం నుండి మరిన్ని నిధులు తీసుకొస్తా అభివ్రుద్ది చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు10 లక్షల చొప్పున ప్రోత్సాహక నగదు అందజేస్తానని ప్రకటించిందని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1203 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయన్నారు. ఒక్కో పంచాయతీకి 10 లక్షల చొప్పున మొత్తం 120 కోట్ల 30 లక్షల రూపాయలు ఇవ్వాలి, కానీ ఇంతవరకు నయాపైసా ఇయ్యలేదని పేర్కొన్నారు.

హామీలిచ్చి మోసం చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ సర్కార్ ను మించిపోయారన్నారు. ప్రోత్సాహక నిధులు ఎందుకు ఇవ్వడం లేదనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలను కోరారు.రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివ్రుద్ధికి చిల్లిగవ్వ ఇవ్వడంలేదన్నారు.మాజీ సర్పంచులు చేసిన పనులకు బిల్లులివ్వాలని తిరిగి తిరిగి ఆత్మహత్యలు చేసుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని,

ఈ ప్రభుత్వం అదే బాటలో నడుస్తోందన్నారు. బీజేపీ పోరాటాలకు, మాజీ సర్పంచుల ఆందోళనలకు తలొగ్గి వాయిదాల పద్దతిలో పైసలిచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. మాజీ సర్పంచుల బిల్లులు సరే... గ్రామ పం చాయతీల అభివ్రుద్ధికి పైసలేవని ప్రశ్నించారు.

కేంద్రం ఇప్పటి వరకు పంచాయతీల అభివ్రుద్ధి కోసం దశల వారీగా దాదాపు వెయ్యి కోట్లకుపైగా నిధులు మంజూరు చేసిందని, ఆ నిధులతో అంతో ఇంతో అభివ్రుద్ధి పనులు జరుగుతున్నాయే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నా రు. వీళ్లా గ్రామ స్వరాజ్యం....గాంధీ ఆశయాల గురించి మాట్లాడేది అని బండి సంజయ్ విమర్శించారు.