టీఆర్‌ఎస్ పార్టీలో భారీగా చేరికలు
జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో పలు పార్టీల నుంచి తెలంగాణ రాష్ట్ర సేనాలో చేరిక
ఎల్లారెడ్డి ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి,నియోజక వర్గంలో నీ లింగంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ లోకి తను పార్టీల చెందిన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో జిల్లా అధ్యక్షుడు ఎదురుగట్ల సంపత్ గూడ ఆధ్వర్యంలో చేరారు.
పార్టీలో చేరిన పలువురు మాట్లాడుతూ నూతనంగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సేన టిఆర్‌ఎస్ పార్టీ ఎజెండా మరియు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ మేనిఫెస్టో ఎంతో బాగుందని పార్టీ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి తప్పకుండా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన పార్టీ అధ్యక్షులు జిల్లా కార్యదర్శి ప్రతాపరెడ్డి జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు జైల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.






