20 March, 2026 | 7:02 AM

టీఆర్పీలో భారీగా చేరికలు

20-03-2026 12:27 AM

ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): గజ్వేల్‌కు చెందిన పలు పార్టీల నాయకులు గురువా రం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ ఎత్తునచేరారు. హైదరాబాద్‌లోని టీఆర్పీ కేంద్ర కార్యా లయంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో చేరా రు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. గజ్వేల్‌లో త్వరలోనే టీఆర్పి నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి భారీ ఎత్తున ప్రజాసభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

సమాజంలో వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి, బీసీల హక్కుల కోసం పోరాటాన్ని మరింత బలంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బీసీలపై ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా మనమంతా ఐక్యంగా నిలబడాలని, విభేదాలు పక్కనపెట్టి ఒకే దారిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.