29 July, 2026 | 2:06 PM

కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

29-07-2026 01:07 PM

నిర్మల్‌లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలు

నిర్మల్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీనికి 21,583 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, బయటకు వెళ్తున్న నీటి పరిమాణం కేవలం 67 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో నీటి మట్టం 700 అడుగులకు గాను 685.275 అడుగులుగా నమోదైంది. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాలు, దానిని ఆనుకుని ఉన్న గ్రామాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం వస్తోంది.