29 July, 2026 | 2:46 PM

కబ్జాకోరుల నుండి ఆస్తులు కాపాడిన ఘనత హైడ్రాదే!

29-07-2026 01:47 PM

తుంగతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న.

రాజకీయాలకతీతంగా మేధావులు యువత  స్వాగతించాలి.

తుంగతుర్తి,(విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కబ్జా కోరుల నుండి, ప్రభుత్వ ఆస్తులను కాపాడిన ఘనత హైడ్రా రంగనాథీనని, హైకోర్టు తప్పుదోవ పట్టించడం, బాధాకరమని, రాజకీయాలకతీతంగా మేధావులు, యువత, హైడ్రాన స్వాగతించాలని తుంగతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలనలో భాగంగా  ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి . గత ప్రభుత్వాలు తీసుకొని నూతన విధానాన్ని హైడ్రాను తీసుకురావడం జరిగింది. హైడ్రా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ భూములను. చెరువులను.నాలాలను.మరియు పార్కులను ఆక్రమించినకబ్జా కోరుల నుండి బడా పార్సరమికవేత్తల నుండి కొంతమంది రాజకీయనాయకుల ఆక్రమంలో ఉన్నటువంటి స్థలాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వం  కాపాడుతుంది. ఉమ్మడి ఆస్తులను కాపాడడం మనందరి బాధ్యత. వారు ఎవరైనా ఎంతటి వారైనా ధనికులైన. పేదవారైనా. గిట్టని కొంతమంది అక్రమార్కులు హైకోర్టులో కేసులు వేసి హైడ్రా పని విధానాన్ని తప్పుదోవ పట్టించే విధంగా కేసులు వేయడం జరిగింది.

ఇది ముమ్మాటికి తప్పు. హైదరాబాద్ చిన్న వర్షం వచ్చినా నాళాలు నిండి రోడ్లు జలమయమై హైదరాబాద్ ప్రజలకు నానా తిప్పలు జరిగేవి. తెలంగాణ ప్రజలారా. మేధావులారా విద్యావేత్తలరా మరి ముఖ్యంగా తెలంగాణ యువత. తెలంగాణ ఉద్యమకారులు. కవులు కళాకారులుమేల్కొని హైడ్రా చేసినటువంటి మంచి పనులను స్వాగతించడమే కాకుండా మీ మద్దతు పూర్తిగా హైడ్రా రంగనాథ్ ప్రకటించాల్సిన కోరుతూ ఉమ్మడి ఆస్తులను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని.   కబ్జా కోరులనుండి కాపాడబడిన చెరువులను నాలాలను మరియు కుంటలను ఉదాహరణగా తీసుకుంటే మన కళ్ళ ముందు కనపడేవి.బతుకమ్మ కుంట . ఎన్ కన్వర్షన్  గండిపేట చెరువు  మనకు కనిపించట్లేదా. అందుకే మనమందరము కలిసికట్టుగా యజ్ఞం చేసి హైడ్రాను కాపాడుకోవాలని ఆయన కోరారు.