భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
29-07-2026 01:38 PM
సంస్థాన్ నారాయణపూర్ ఎస్సై పాండు
సంస్థాన్ నారాయణపూర్,జూలై 29(విజయక్రాంతి): ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సంస్థాన్ నారాయణపూర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సీతపాండు తెలిపారు.అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కరెంటు స్తంభాలు,శిథిలావస్థలో ఉన్న ఇండ్ల వద్దకు,తెగిపడిన కరెంటు వైర్ల వద్దకు వెళ్లకూడదని సూచించారు.వాహనదారులు రహదారులపై నిలిచి ఉన్న నీటి వద్ద అతివేగంతో వెళ్లకూడదని, నీరు ప్రవహించే ప్రాంతాలలో,వాగులలో పిల్లలను వెళ్లకుండా చూడాలని అన్నారు.పోలీసుశాఖ, వాతావరణ శాఖ సూచనలను పాటించాలని ఏదైనా అత్యవసరమైతే వెంటనే అత్యవసర నంబర్లకు పోలీసు స్టేషన్ ను సంప్రదించాలని ప్రకటన ద్వారా తెలిపారు.






