ఎవరిని తప్పించేందుకు ఈ ఆలస్యం
- కడితి వేటలో అటవీ సిబ్బంది చేతివాటం ?
- ఘటన స్థలానికి ఒక ఎఫ్ఎస్ఓ బదులు మరో ఎఫ్ఎస్ఓ
- వాచర్ల ఫోన్లు తీసుకొని రహస్య విచారణ?
- ఘటన జరిగిన ఐదు రోజులకు మీడియాకు సమాచారం
అచ్చంపేట జూలై 29: నల్లమల్ల అభయారణ్యం(Nallamala Forest) అరుదైన జాతికి చెందిన వన్యప్రాణి కడితివేట కలకలం రేపింది. ఘటనను క్షేత్రస్థాయిలోనే కనుమరుగు చేయాలని ఓ అటవీ ఉద్యోగి ప్రయత్నించిన చివరికి అది బహిర్గతమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా సదరు ఉద్యోగి నిందితలతో భారీ మొత్తంలో తీసుకుని బేరసారాలు సాగించినట్లు.. చివరికి విషయం ఆ నోట ఈ నోట ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లుగా తెలుస్తోంది.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం(Achampet Mandal) సిద్దాపూర్ సెక్షన్ పరిధిలోని పద్మారంతండాలో ఈనెల 24న కడతి మాంసాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ నిందితులను 28న అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరపరిచారు. విషయాన్ని అటవీ అధికారులు బుధవారం (29న) వెల్లడించారు. కడితే వేటాడిన ఘటనలో మొత్తం 17 మంది నిందితులను గుర్తించి కోర్టులో హాజరు పరిచామని.. వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో కల్వకుర్తి సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు.
ఒకరికి బదులు మరొకరు ?
పద్మారం తండాలో కడితిని వేటాడి మాంసాన్ని కుప్పలుగా పోగు చేస్తున్నారని సమాచారాన్ని ఓ వ్యక్తి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటన సిద్ధాపూర్ సెక్షన్ పరిధిలో జరిగింది. నిజానికి సిద్ధాపూర్ కు చెందిన ఫారెస్ట్ సెక్షన్ అధికారి వెంకటేష్ అక్కడికి సిబ్బందితో కలిసి వెళ్లాలి. కానీ ఘటనా స్థలానికి ఘనపూర్ సెక్షన్ కు చెందిన నరేందర్, వాచర్లు ప్రసాద్ నిరంజన్ శ్రీను వెళ్లారు. నిందితులు మాంసాన్ని పోగో చేస్తుండగా ఫోటో సైతం తీసుకున్నారు. కానీ వారిని వెంటనే అదుపులోకి తీసుకోలేదు. ఈ దాడికి నేతృత్వం వహించిన అటవీ ఉద్యోగి సదరు నిందితులతో పెద్ద మొత్తంలో బేరసారాలు సాగించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే నిందితులను అదుపులోకి తీసుకోకుండా.. ఉన్నతస్థాయి ఉద్యోగులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సెల్ ఫోన్ లాక్కొని విచారణ
సాధారణంగా ఏదైనా సంఘటన జరిగితే అటవీ ఉద్యోగులుగాని ఇతర మరేశాఖ అధికారులైనా సరే నిందితుల ఫోన్లో లాక్కొని విచారణ చేపడతారు. కానీ ఇక్కడ మాత్రం సెక్షన్ ఆఫీసర్ నరేందర్ వాచర్ల సెల్ఫోన్లు తీసుకొని వారిని నిందితుల దగ్గర ఉంచి అతనొక్కడే వెళ్లి రహస్య విచారం చేశారని ఓ వాచర్ తెలిపారు. నిందితుల నుంచి లక్షల్లో వసూలు చేసి ఆ కేసును బయటకు రాకుండా ఉండేందుకే అతను ఈ విధంగా వ్యవహరించాడని ఆరోపణలు ఉన్నాయి. అందుకే వాచర్లను దూరంగా ఉంచి తనకు సంబంధం లేని సెక్షన్ పరిధిలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఐదు రోజుల ఆలస్యం వెనక మతలభేమి ?
ఎక్కడైనా వన్యప్రాన్ లో బేటా జరిగితే వెంటనే స్పందించి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారిని కోర్టులో హాజరుపరిచే అటవీ అధికారులు ఇక్కడ మాత్రం నిందితులను అరెస్టు చేయడంతో ఆలస్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదంతా సదరు ఉద్యోగిని కాపాడడంతో పాటు.. నెపం కిందిస్థాయి సిబ్బందిపై నెట్టి వారిని బలి పశువు చేయాలని ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నాకేమీ తెలియదు: ఎఫ్ఎస్ఓ
కడిపిని వేటాడిన ఘటనలో కేసులు నియోజకవర్చేందుకు నిందితుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎఫ్ఎస్ఓ నరేందర్ ను వివరణ కోరగా అదంతా అబద్ధమని చెప్పారు. నిందితులను అరెస్టు చేయడంలో ఆలస్యం ఎందుకు జరిగిందన్న గారిపై సమాధానం దాటవేశారు. దీనిపై ఎఫ్డిఓ చంద్రశేఖర్ స్పందిస్తూ పూర్తి వివరాలను ఈరోజు సాయంత్రం 4 గంటలకు మీడియాకు తెలియజేస్తామని చెప్పారు. ఏదైనా అదనపు సమాచారం ఉంటే తమతో పంచుకోవాలని కోరారు.






