29 July, 2026 | 2:38 PM

రోటరీ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

29-07-2026 01:42 PM

బోధన్,జూలై 29(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల బాలికలకు ప్రయాణ సౌకర్యం కల్పించే లక్ష్యంతో రోటరీ సంస్థ ఆధ్వర్యంలో 325 మంది అర్హులైన విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బోధన్‌ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా 325 లను సైకిళ్లను గ్రామీణ ప్రాంతాల బాలికలకు బుధవారం రోజున పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రోటరీ క్లబ్ వారు తెలిపారు

ఈ కార్యక్రమానికి రోటరీ ట్రస్ట్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ సహకారం అందిస్తుండగా, రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ బోధన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆర్‌టీఎన్ ఉదయ్ సుధీర్ పిలానీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే పీడీజీ ఎన్.వి. హన్మంత్ రెడ్డి (DRFC)  అతిథిగా పాల్గొంటారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థినులు పాఠశాలలకు సులభంగా చేరుకునేందుకు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. అర్హులైన విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, రోటరీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.