హ్యామ్ రోడ్లలో భారీ అవినీతి
- ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంపై తీవ్రభారం
- రేవంత్‌రెడ్డి పరోక్షంగా అప్పులు చేస్తున్నారు
- ఎక్సెస్ టెండర్లను రద్దు చేసి.. అన్నీ రీకాల్ చేయాలి
- మాజీమంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): హ్యామ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, ఈ విషయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలోనే ఆధారాలతో సహా ‘మేము బయట పెట్టాం’ అని మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌లో 25 టెండర్లను ఎక్సెస్ టెండర్లతో కొందరికి మాత్రమే కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని ఆనాడే చెప్పామ న్నారు. తాము చెప్పింది నిజమైందని, హ్యా మ్ మోడల్ రోడ్ల టెండర్‌లో 25 శాతం ఎక్సెస్‌తో టెండర్ వేశారని చెప్పారు.
ఆర్‌అండ్ బీలో రూ.11 వేల కోట్లకు టెండర్ పిలిస్తే ఎక్సెస్‌తో కలిసి దాదాపుగా రూ.15 వేల కోట్ల వరకు పోయిందన్నారు. పంచాయతీరాజ్‌లో రూ.6 వేల కోట్లతో టెండర్ పిలిస్తే దాదాపు రూ.7వేల కోట్ల నుంచి 8 వేల కోట్ల వరకు అవుతుందని, ఎక్సెస్ టెండర్ వల్ల రూ.5 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. హ్యా మ్ మోడల్ రోడ్ల కోసం 60 శాతం బ్యాంకు నుంచి అప్పు తెచ్చి, 30 ఇన్‌స్టాల్‌మెంట్‌లో 15 సంవత్సరాల పాటు వడ్డీతో సహా బ్యాంకుకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.
ఈ టెండర్లలో 10 శాతం మొబిలైజే షన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, ప్రాణహిత చేవెళ్ల కోసం మొబిలై జేషన్ అడ్వాన్సుల విధానాన్ని తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ఇది జలయజ్ఞం కాదు.. ధనయజ్ఞం అని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి పోరాడారని గుర్తుచేశారు. అప్పుడు అలా మాట్లాడి న రేవంత్‌రెడ్డి, ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తీసుకొ చ్చారని వెల్లడించా రు. 2014 బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మొబిలైజేషన్ అడ్వాన్సులు విధానాన్ని రద్దు చేశామన్నారు. మా హయాంలో 5 శాతం కంటే ఎక్కువగా టెండర్ ఉంటే వెంటనే రీకాల్ చేసేవాళ్లమని గుర్తు చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 25 శాతం టెండర్ ఎక్సెస్ వేస్తున్నా పట్టించుకోవ డం లేదని, ఎక్సెస్ టెండర్లను వెంటనే రద్దు చే యాలని, అన్నీ రీ కాల్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇవ్వాళ ఉంటారు.. రేపు పోతారని, ఎక్సెస్ టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందన్నారు. ఈ టెండర్‌లలో ఒక కంపెనీకి 15 టెండర్లు దక్కబోతున్నాయని, తొందరలోనే ఆధారాలతో సహా బ యటపెడుతానని స్పష్టం చేశారు. ఆర్‌అండ్‌బీలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీరింగ్ వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ జోగారెడ్డి పదవీ కాలం పొడిగించి, ఈ టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రధానమైన ఇంజనీరింగ్ లో ముఖ్యమైన అధికారులను ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారని ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రం నాటి నీటి కష్టాలు..
ఉమ్మడి రాష్ట్రం నాటి ప్రజల క’న్నీటి’ కష్టాలను రేవంత్‌రెడ్డి తిరిగి తీసుకొచ్చారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న నీటి కష్టాలపై శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిం చారు. మార్పు రావాలి అంటూ ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెచ్చిన అసలైన మార్పు ఇదని, పల్లె నుంచి పట్నం దాకా తాగునీటి కోసం పడుతున్న తండ్లాటకు నిదర్శనం ఇదని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేస్తే, రేవంత్ కనీసం ఆ పథకాన్ని కొనసాగించలేక పోతున్నరని విమర్శించారు. దీంతో ఎక్కడ చూసినా మళ్లీ ట్యాంక ర్లు, బిందెలు, డ్రమ్ములు దర్శనం ఇస్తున్నాయన్నారు. ‘సీఎం, మంత్రులు కళ్లు తెరిచి చూడండి. మీ నోటి నుంచి అబద్ధాల ప్రవాహాన్ని పారించడం మానేసి, మిషన్ భగీరథ పైపుల్లో నీళ్లు పారించండి. ప్రజల క’న్నీటి’ బాధలు తీర్చండి’ అని హితవు పలికారు.






