జీవో- ఉపసంహరించుకోవాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, మే1(విజయక్రాంతి): వి ద్యార్థుల ఖాతాలో ఫీజుల స్కాలర్షిప్లు వేయాలని జారీ చేసిన జీవో 7 ప్రభుత్వ ఉత్తర్వు లను తక్షణమే ఉపసంహరించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షు డు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎందుకంటే పరోక్షంగా ఫీజులను మొదట అడ్మిషన్ల సమయంలో విద్యార్థులు ఫీజులు కడితేనే అడ్మిషన్లు ఇస్తానన్నారని, ఈ పద్ధతిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఫీజుల సమస్యలపై ఇంత గొడవ జరుగుతున్నా కానీ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు.
ఈ మేరకు శు క్రవారం కాచిగూడలోని మహారాజా హోట ల్లో తెలంగా ణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణ య్య హాజరై మాట్లాడుతూ ఒకవైపు ప్రభు త్వం ఇంకోవైపు కోర్సులు, ఫీజులు, స్కీము లు ఎత్తివేసే కుట్రలు చేస్తుందన్నారు. దీనిని బీసీ ప్రజలు సవాలుగా తీసుకుంటున్నారన్నారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, తెలంగాణ బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీ రాజేందర్, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్య, నాయకులు శివకుమార్ యా దవ్ తదితరులు పాల్గొన్నారు.






