15 వార్డులో మాస్ క్లీనింగ్
26-08-2026 06:46 PM
పనులను పర్యవేక్షించిన కౌన్సిలర్
కామారెడ్డి, ఆగస్టు 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 15వ వార్డు ఆర్కే నగర్, ఓల్డ్ ఏజ్ హోమ్, మైసమ్మ టెంపుల్ ఫ్రంట్ సైడ్, మినీ పార్క్ ముందు రోడ్డు, లలో రోడ్డు ఇరువైపులా ఉన్న గడ్డి పిచ్చి మొక్కలను 15వ వార్డ్ కౌన్సిలర్ వనిత రామ్మోహన్ మాస్ క్లీనింగ్ చేయించారు. కాలనీవాసులు ఇబ్బందులను కౌన్సిలర్ వనిత రామ్మోహన్ కు వివరించడంతో బుధవారం పనులు చేపట్టారు. రోడ్డుకి వైపులా ఉన్న చెట్ల పొదలను ట్రాక్టర్ ద్వారా చదును చేయించారు






