అధికారం అంటే హోదా కాదు.. ప్రజలకు సేవ చేసే అవకాశం
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గాన్ని మంగళవారం రోజు ఏర్పాటు చేయగా కార్యవర్గంలో కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన రాస రవీందర్ రెడ్డి ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో పాటు మండల పార్టీ అధ్యక్షుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులు, గ్రామ కార్యకర్తలు, మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు.“అధికారం అంటే హోదా కాదు.. ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం” అని పేర్కొంటూ, తనకు అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తానని ఆయన తెలిపారు.






