26 August, 2026 | 8:34 PM

వ్యక్తి కనబడుట లేదు

26-08-2026 07:36 PM

అశ్వారావుపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం కాలని (బూరుగు గుంపు) గ్రామానికి  చెందిన మేడి  నరసింహారావు అనే  వ్యక్తి కనబడటం లేదు అని అతని భార్య సావిత్రి  పిర్యాదు చేసినట్టు ఎస్ ఐ యయాతి రాజు ఓ ప్రకటన లో తెలిపారు.

పోలీసు లు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఫిర్యాదుదారుని భర్త మేడి నరసింహారావు వయస్సు సుమారు 38 సం||లు, పామాయిల్ గెలలు కటింగ్ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అని, ఈ నెల 11 వ తేదీ రాత్రి సుమారు 8:00 గంటల సమయంలో కుటుంబ కలహాల కారణంగా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయి తిరిగి ఇంటికి రాలేదు అని భార్య సావిత్రి చెప్పినట్టు తెలిపారు.

సదరు వ్యక్తి సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే వదిలి వెళ్ళిపోయాడని బంధువుల ఇళ్లలో, చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంత వెతికినా ఆచూకీ లభించకాపోవడం తో బుధవారం అతని భార్య పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎస్ ఐ తెలిపారు.

కనిపించకుండా పోయిన వ్యక్తి వివరాలు:

పేరు: మేడి నరసింహారావు

వయస్సు: 38-40 సం||లు

ఎత్తు: 5.5 అడుగులు

మేని ఛాయ: చామన ఛాయ

చివరిసారిగా ధరించిన దుస్తులు: లైట్ బ్లూ (స్కై బ్లూ) గళ్ళ చొక్కా, తెలుపు రంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నట్టు తెలిపారు. పై వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వెంటనే అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ కు గాని, డయల్ 100 కు గాని సమాచారం ఇవ్వాలని  ఎస్ఐ యయాతి రాజు కోరారు.