ఘనంగా మిలాద్ ఉన్ నబీ
26-08-2026 07:26 PM
మద్దూర్: మద్దూరు మండల కేంద్రంలో బుధవారం మిలాద్ ఉన్ నబి పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం ఈద్గా దగ్గరకు వెళ్లి నమాజ్ చేసి అనంతరం ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం సాయంత్రం మండల పురవీధుల్లో ఊరేగింపుగా ర్యాలీ చేస్తూ మహమ్మద్ ప్రవక్తను తలుచుకున్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు యువకులు పాల్గొన్నారు.






