26 August, 2026 | 7:36 PM

కట్లేరు ఆధునీకరణ పనులను పరిశీలించిన బండారు నరసింహారావు

26-08-2026 06:44 PM

ఎర్రుపాలెం ఆగస్టు 26 ( విజయక్రాంతి): మండలంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృషితో మంజూరైన కట్లేర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులను బుధవారం నాడు  మామునూరు గ్రామంలొ కట్లేరు కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణపనులను సంబంధిత శాఖ అధికారి ఎస్ ఈ శ్రీకాంత్ తో కలిసి మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు  జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి పరిశీలించారు.

అనంతరం చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ.. బ్రిడ్జి అప్రోచ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ఎడమ కాలువ బ్రిడ్జికి దిగువలొ ఉన్న ఆయకట్టు గ్రామాలు చొప్పకట్లపాలెం, బనిగండ్లపాడు,పెద్దగోపారం వరకు కట్లేరు కాలువ నీళ్లు ఇబ్బంది లేకుండా అందించాలని కోరారు. వీరితోపాటు నీటిపారుదల శాఖ ఈ ఈ మధు, డి ఈ సాంబయ్య, క్లస్టర్ ఇంచార్జ్ శీలం వెంకటరామిరెడ్డి, పాశం రవి,అవులూరి చిన్న పుల్లారెడ్డి తదితరులు ఉన్నారు.