విద్యుత్ ప్రమాదంలో భవన కార్మికుడు మృతి
హుజూర్ నగర్: విద్యుత్ ప్రమాదంలో భవన కార్మికుడు మృతి చెందిన విషాద ఘటన హుజూర్ నగర్ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది...పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు వెన్నబోయిన ఉదయ్ (39) మటన్ మార్కెట్ పరిధిలోని గుండా గోపి తన ఇంటి నిర్మాణం చేస్తుండగా బిల్డింగ్ వర్క్ చేసే సమయంలో అకస్మాత్తుగా ఉదయ్ విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు తెలిపారు.
దీంతో మృతి చెందిన ఉదయ్ మృత దేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబం సభ్యులకు అప్పగించారు.ఉదయ్ కు భార్య పుణ్యావతి,కుమారుడు హేమంత్,కుమార్తె ప్రణీత ఉన్నారు.తోటి భవన నిర్మాణ కార్మికుడు ఉదయ్ మృతి చెందడంతో భవన నిర్మాణ రంగంలో విషాద ఛాయలు అమలుకున్నాయి.ఈ ఘటనపై ఎస్ఐ చలికంటి నరేష్ కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు ప్రారంభించారు తెలిపారు.






