26 August, 2026 | 8:44 PM

మిత్రుడి తండ్రి మృతికి ఆర్థిక సాయం

26-08-2026 07:46 PM

ఆపదలో అండగా నిలిచిన పదో తరగతి మిత్రులు

రూ.30 వేల ఆర్థిక సాయం

కోదాడ,(మునగాల),(విజయక్రాంతి): మిత్రుడి కుటుంబంలో విషాదం నెలకొనడంతో 2008లో పదో తరగతి చదివిన స్నేహితులంతా ఒక్కటై అండగా నిలిచారు. మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2008లో పదో తరగతి చదివిన ఇటికాల జాను సుందర్‌ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.30 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. స్నేహితుల్లో ఎవరి కుటుంబంలో ఆపద వచ్చినా తమవంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు. కష్టసమయంలో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులను పలువురు అభినందించారు.